PSL 2026: పాకిస్థాన్– -ఆఫ్ఘానిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో ఆస్ట్రేలియా జట్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాబూల్‌లో జరిగిన తాజా ఎయిర్ స్ట్రైక్స్‌లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితి మరింత దిగజారి పోయింది. పాకిస్తాన్ సూపర్ లీగ్( పీఎస్‌ఎల్) 2026లో పాల్గొనడానికి పాక్ వెళ్లాల్సిన ఆసీస్ ప్లేయర్స్ భద్రతపై ఇప్పుడు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ లాంటి ప్రముఖ ఆటగాళ్లు పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వ ట్రావెల్ అడ్వైజరీ ప్లాట్‌ఫారమ్ ‘స్మార్ట్‌ట్రావెలర్’ తమ పౌరులు పాకిస్థాన్‌కు వెళ్లడాన్ని మరోసారి ఆలోచించాల్సి ఉందని హెచ్చరించింది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరికతో పాకిస్తాన్ దేశంలోని భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండి, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆటగాళ్ల భద్రత ప్రధాన సమస్యగా మారింది. పీఎస్‌ఎల్ 2026లో సుమారు 14 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాల్గొనాల్సి ఉంది. వారిలో డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ తమ తమ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇక కాబూల్‌లో జరిగిన దాడిలో ఒక పెద్ద రిహాబిలిటేషన్ కేంద్రం ధ్వంసమైంది. పాకిస్థాన్ ఈ దాడికి బాధ్యత వహించిందని ఆప్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ఘటనలో సుమారు 400 మంది మరణించగా, 250 మందికి పైగా గాయపడ్డారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పీఎస్‌ఎల్ 2026లో ఆసీస్ ఆటగాళ్లు పాల్గొంటారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. పరిస్థితిని అధికారులు సమీక్షిస్తూ ఉండగా, భద్రతా అంశాల ఆధారంగా ప్లేయర్స్ నిర్ణయం ఉండే అవకాశం ఉంది. మార్చి 26వ తేదీన లాహోర్‌లో ప్రారంభమయ్యే ఈ టోర్నీపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది.
►ALSO READ | MI Tickets: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టికెట్ల అమ్మకం షెడ్యూల్ రిలీజ్
వివిధ జట్లలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు:
* ముల్తాన్ సుల్తాన్స్: లాక్లన్ షా, జోష్ ఫిలిప్, స్టీవ్ స్మిత్, అష్టన్ టర్నర్, పీటర్ సిడిల్
* హైదరాబాద్ హ్యూస్టన్ కింగ్స్‌మెన్: మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రైలీ మెరిడిత్
* ఇస్లామాబాద్ యునైటెడ్: మ్యాక్స్ బ్రయంట్
* కరాచీ కింగ్స్: డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా
* పేషావర్ జల్మీ: ఆరోన్ హార్డీ
* క్వెట్టా గ్లాడియేటర్స్: బెన్ మెక్‌డెర్మాట్, సామ్ హార్పర్, స్పెన్సర్ జాన్సన్
𝐍𝐄𝐖𝐒 𝐎𝐅 𝐓𝐇𝐄 𝐃𝐀𝐘 📰
— Hyderabad Kingsmen (@HHKingsmen) March 17, 2026
The captain has been crowned. 👑 pic.twitter.com/A0pVDQLlUO
Peshawar is due to play Rawalpindi in Peshawar later this month. Australian Government advice explicitly advises people not to travel to that city. Aaron Hardie contracted to Peshawar and Jake Fraser-McGurk to Rawalpindi https://t.co/pOGQe5Uy2f
— Daniel Cherny (@DanielCherny) March 17, 2026
